తిరుగులేని యాంటీబయాటిక్స్

3 May, 2016 22:07 IST|Sakshi
తిరుగులేని యాంటీబయాటిక్స్

లండన్: యాంటీబయాటిక్స్‌లో కొత్త సంచలనానికి తెరతీశారు లింకన్ వర్సిటీ శాస్త్రజ్ఞులు. యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే సామర్థ్యమున్న సూక్ష్మ క్రిములను కూడా చంపే ఔషధాన్ని వారు  రూపొందించారు.  ఈ కొత్త యాంటీబయాటిక్‌కు టీక్సోబాక్టిన్ అని పేరు పెట్టారు. మట్టిలోని సూక్ష్మజీవులతో దీన్ని తయారుచేశారు.

సూక్ష్మజీవ నిరోధకాలను తట్టుకునే బ్యాక్టీరియాపై పోరులో కొత్త చరిత్రను సృష్టించబోతోందని గతేడాది అమెరికాలో ఈ మందు ప్రశంసలందుకొంది. దీన్ని కనిపెట్టిన బృందంలో భారత సంతతికి చెందిన ఈశ్వర్ సింగ్ అనే పరిశోధకుడు ఉన్నారు. పరీక్షల్లో ఇది సమర్థవంతంగా పనిచేసి, సూక్ష్మ క్రిములను చంపేసింది. ఈ మందు భవిష్యత్తులో అందుబాటులోకి రాగలదని శాస్త్రజ్ఞులు విశ్వాసంతో ఉన్నారు.

మరిన్ని వార్తలు