ఆపిల్‌ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు

29 Aug, 2019 14:48 IST|Sakshi

'సిరి'తో 'ఆపిల్‌'కు కొత్త తలనొప్పి!

ఆపిల్‌ నుంచి 300 సిరి కాంట్రాక్టర్ల తొలగింపు

శాన్ఫ్రాన్సిస్కొ: ప్రముఖ మొబైల్‌ తయారీదారు ఆపిల్‌కు ‘సిరి’ కాంట్రాక్టర్లు కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. దీంతో ఆపిల్‌ కంపెనీ ఐర్లాండ్‌లోని తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 300 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. తమ వినియోగదారులకు చెందిన సున్నితమైన విషయాలను 'సిరి' పోగ్రామ్‌ కాంట్రాక్టర్లు రహస్యంగా విని, ఆపిల్‌ సేవలను దుర్వినియోగ పరచిన కారణంగా వారిని తొలగించడంతో యూరప్‌ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశయైంది. 

ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారులు - సిరితో చేసిన సంభాషణలు విని అది ఇచ్చే రెస్పాన్స్‌లో అవసరమైన మార్పులు చేయాలి. కానీ వారు వినియోగదారులు మాట్లాడుకునే వ్యక్తిగత శృంగార సంభాషణలు, డ్రగ్స్‌, బిజినేస్‌ డీల్స్‌ను కాంట్రాక్టర్లు పదేపదే విన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై  దుమారం రేగడంతో ఆపిల్‌ కంపెనీ వెంటనే సిరి గ్రేడింగ్‌ ప్రోగ్రామ్‌ను నిలిపివేసి కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ‘సిరి’ సేవలను కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారని, వాటిలో రికార్డైన సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఓ ప్రజావేగు(విజిల్‌ బ్లోయర్‌) గార్డియన్‌ పత్రిక ద్వారా తెలపడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆపిల్‌ వివరణ ఇస్తూ ‘తమ కంపెనీ ప్రధానంగా వినియోగదారుని భద్రతకి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఘటనపై వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని’  తెలిపింది. అంతేకాక సదరు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు