చైనాలో 160 శాతం పెరిగిన ఆపిల్‌ అమ్మకాలు

22 May, 2020 16:37 IST|Sakshi

బీజింగ్‌: ఐఫోన్‌ మేకర్‌ ఆపిల్‌కు  చైనాలో ఆదరణ ఎంతమాత్రం తగ్గలేదు.  కరోనా వైరస్‌ సంక్షోభ  సమయంలో కూడా  అక్కడ తన ప్రత్యేకతను చాటుకుంది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో అమ్మకాలు కాస్త మందగించినా తిరిగి ఏప్రిల్‌  పుంజుకున్నాయి. 3.9 మిలియన్ ఐఫోన్‌లను విక్రయించింది, ఇది అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు 160 శాతం పెరిగింది.

మీడియా తాజా నివేదికల ప్రకారం మార్చి విక్రయాలతో పోల్చితే ఏప్రిల్‌లో చైనాలో మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 94 శాతానికి పైగా పెరిగి 40.8 మిలియన్లకు చేరుకున్నాయి. కౌంటర్ పాయట్ రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం, చైనాలో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు మార్చి త్రైమాసికంలో, 2019 క్యూ1 తో పోలిస్తే 22 శాతం పడిపోయాయి. అయితే ఫిబ్రవరిలో చైనా అంతటా ఆపిల్ దుకాణాలను మూసివేసినప్పటికీ వినియోగదారులు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల నుండి ఐఫోన్‌ల కొనుగోలును కొనసాగించారని కౌంటర్ పాయింట్ సీనియర్ విశ్లేషకుడు ఏతాన్ క్వి చెప్పారు

ఐడీసీ సమాచారం ప్రకారం చైనాలో ఆపిల్‌ ఫోన్లకు ఆదరణ ఎక్కువ. 2018 తో పోలిస్తే కాస్త తగ్గిన,  2019లో చైనాలో స్మార్ట్‌ఫోన్ విక్రేతలలో ఆపిల్ అతిపెద్ద యూజర్ బేస్ కలిగి ఉంది, ఐఫోన్‌లు 18.9 శాతం వాడుకలో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి ఐవోఎస్‌కు మారుతున్న వారి కూడా సంఖ్య కూడా ఎక్కువే. వరుసగా 7వ నెలలో కూడా  ఐఫోన్ 11 జనవరి- ఫిబ్రవరి కాలానికి అత్యధికంగా అమ్ముడుబోయిన ఫోన్‌గా  నిలిచింది. (ఆర్‌బీఐ రేట్‌ కట్‌ : రూపాయి బలహీనం)

కోవిడ్‌-10 మహమ్మారి వ్యాప్తితో మార్చిలో గ్రేటర్ చైనా వెలుపల తన రిటైల్ దుకాణాలన్నింటినీ ఆపిల్ మూసివేసింది. కరోనా తగ్గుముఖం పట్టడం, ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ప్రస్తుతం ఆపిల్ స్టోర్లు తెరుచుకున్నాయి. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు)

మరిన్ని వార్తలు