ఐఫోన్‌ ఇక మరింత సురక్షితం

15 Jun, 2018 04:21 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ కీలక ప్రకటన చేసింది. పాస్‌వర్డ్‌ అవసరం లేకుండా ఐఫోన్లలోని సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించేలా ఉన్న సాఫ్ట్‌వేర్‌ లోపాన్ని సరిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే ఐవోస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్‌కు చార్జింగ్‌ పెట్టేందుకు, సమాచార మార్పిడి కోసం వాడుతున్న లైటనింగ్‌ పోర్ట్‌ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్‌ చేయగలుగుతున్నారని తెలిపింది. త్వరలో తీసుకురానున్న అప్‌డేట్‌తో తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయగానే ఐఫోన్‌ డేటా గంటపాటు నిలిచిపోతుందని వెల్లడించింది. తాజా అప్‌డేట్‌ తర్వాత కూడా లైటనింగ్‌ పోర్ట్‌తో చార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చంది. యాపిల్‌ తాజా నిర్ణయం ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎఫ్‌బీఐ, పోలీసులకు ఇబ్బందికరం కానుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు