టెక్‌ జెయింట్ల పోరుకు ఫుల్‌స్టాప్‌

17 Apr, 2019 10:46 IST|Sakshi

యాపిల్‌, క్వాల్కామ్‌ రాయల్టీ యుద్ధానికి ముగింపు

పరస్పర  వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని  నిర్ణయం

స్వాగతించిన టెక్‌ నిపుణులు, ఎనలిస్టులు

అమెరికా టెక్‌ జెయింట్లు  యాపిల్‌, క్వాల్కామ్‌ తమ మధ్య ఉన్న వైరానికి  ముగింపు పలికాయి.  ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాయల్టీ చెల్లింపుల యుధ్దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాయి. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరిందని యాపిల్, అమెరికన్ మైక్రోచిప్ తయారీదారు క్వాల్కామ్‌ సంయుక్తంగా మంగళవారం ప్రకటించాయి. పరస్పర దాఖలు చేసుకున్న అన్ని వ్యాజ్యాలను  ఉపసంహరించుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇందుకు ఇరు కంపెనీల మధ్య ఆరు సంవత్సరాల లైసెన్స్ ఒప్పందాన్ని  కుదుర్చుకున్నాయి.  ఈ లెసెన్స్‌ను అవసరమైతే మరో రెండేళ్లపాటు  విస్తరించుకునే ఆప్షన్‌కు కూడా ఇందులో జోడించాయి. ఈ ఒప్పందం వైర్‌లెస్‌ పరిశ్రమకు  లబ్ది చేకూరుస్తుందని  విశ్లేషకుడు ప్రాటిక్‌ మూర్‌హెడ్‌ వ్యాఖ్యానించారు.

కాలిఫోర్నియాలో కోర్టులో  వాదనల చివరి నిమిషంలో యాపిల్‌, క్వాల్కామ్‌ ఈ పరిష్కారానికి రావడం విశేషం. గత రెండు సంవత్సరాలుగా, కంపెనీ మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దీంతో కోట్లాది రూపాయలకు చెల్లింపులనుంచి  క్వాల్కామ్‌ బయటపడింది. దీంతో  వాల్‌స్ట్రీట్‌లో క్వాల్కం 23 శాతానికి పైగా పెరిగింది.  దాదాపు 20 ఏళ్లలో ఇది ఉత్తమమైన  లాభంగా మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

టెక్‌ దిగ్గజం యాపిల్‌, చిప్‌ తయారీ సంస్థ క్వాల్కామ్‌ మధ్య పేటెంట్‌, లైసెన్సింగ్‌ విధానంపై  పోరు న్యాయ స్థానానికి చేరింది. 2017 ఆరంభంలో, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమీషన్ వద్ద క్వాలాకామ్‌ తమతో  సహా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులకు లైసెన్సుల విక్రయంలో  యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ  దావా వేసింది. క్వాల్‌ కామ్‌ కంపెనీ మోనోపలి చెలాయిస్తోందన్నది యాపిల్‌ ఆరోపణ.

మరిన్ని వార్తలు