యాపిల్‌ టీవీ, న్యూస్‌ యాప్‌ లాంచ్‌ 

26 Mar, 2019 13:24 IST|Sakshi

 యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ లాంచ్‌

త్వరలోనే యాపిల్‌ క్రెడిట్ కార్డులు

 యాపిల్ ఆర్కేడ్ సర్వీసులు

కాలిఫోర్నియా:  టెక్‌దిగ్గజం యాపిల్‌ మరోసారి సంచలనానికి తెర తీసింది. తన సర్వీస్‌ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకుంది. అంచనాలకనుగుణం గానే టీవీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకువస్తామని ప్రకటించింది.

యాపిల్ టీవీ యాప్‌ను కొత్త డిజైన్‌తో కొత్తగా లాంచ్‌ చేసింది. దాదాపు 100దేశాల్లో ఐఫోన్‌, ఐపాడ్‌, యాపిల్‌ టీవీ 4కె లో ప్రస్తుతానికి దీని సేవలు అందుబాటులో ఉంటాయి. శాంసంగ్‌ స్మార్ట్‌టీవీ, అమెజాన్‌ ఫైర్‌ టీవీ, ఎల్‌సీ, సోనీ, రోకూ, విజియో ప్లాట్‌ఫాంలలో కూడా త్వరలోనే లాంచ్‌ చేస్తామని యాపిల్‌ ప్రకటించింది.  ఇందులో అన్ని కొత్త మూవీ రిలీజ్‌లు, లక్షకుపైగా టైటిల్స్‌తో ఐ  ట్యూన్స్‌ మూవీ కాటలాగ్‌ను అందిస్తుంది. అంతేకాదు యూజర్ల పర్సనల్‌ లైబ్రరినీ బిల్ట్‌ ఇన్‌గా అందిస్తుంది. 

యాపిల్ టీవీ ప్లస్
ఇది స్ట్రీమింగ్ ఆన్‌లైన్ వీడియో సర్వీస్. సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా తన సేవలను అందిస్తుంది. అయితే సబ్‌స్క్రిప్షన్ వివరాలను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. ఇందులో కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ వీడియో కంటెంట్ ఉంటుంది. దీనికోసం కంపెనీ 34 టీవీ, మూవీ ప్రొడక్షన్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

యాపిల్ టీవీ ఛానల్స్ సబ్‌స్క్రైబ్ సేవలను కూడా  ఆవిష్కరించింది. ఇందులో హెచ్‌బీవో, స్టార్జ్, షోటైమ్, సీబీఎస్ ఆల్ యాక్సెస్, స్మిత్‌సోనియన్ ఛానల్, ఎపిక్స్, ఎంటీవీ హిట్స్ వంటి పలు పాపులర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకొని యాపిల్ టీవీ యాప్‌లో చూడొచ్చు. ఆన్ డిమాండ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నవి. 

యాపిల్‌ న్యూస్‌

యాప్‌ యాపిల్ న్యూస్ ప్లస్ అనేది కంపెనీ న్యూస్ యాప్. ఇందులో వివిధ మేగజైన్ల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఇదికూడా సబ్‌స్క్రిప్లన్‌ ఆధారిత సేవ.  వైర్డ్, పాపులర్ సైన్స్, నేషనల్ జాగ్రఫీ అండ్ ఎసెన్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దాదాపు 300 మేగజైన్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

యాపిల్‌ క్రెడిట్‌ కార్డు
సొంతంగా క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తామని యాపిల్ ప్రకటించింది. దీని పేరు యాపిల్ కార్డు. కంపెనీ క్రెడిట్ కార్డు కోసం గోల్డ్‌మన్ శాక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మాస్టర్‌కార్డ్ నెట్‌వర్క్ ఆధారంగా పని చేస్తుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఎట్టకేలకు టర్కీకి చేరిన ఎస్‌-400

మన పడక గదులకు అవే ‘చెవులు’

విమానంలో సీలింగ్‌ను గుద్దుకున్న ప్రయాణీకులు

ప్లాస్టిక్‌ ఇల్లు

అందులో మోదీ మాస్టర్‌ : యూఎస్‌ స్పీకర్‌

ఉందిలే మంచి కాలం

గూగుల్‌, అమెజాన్‌లకు ఫ్రాన్స్‌ షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’