పులిని ప‌ట్టుకోడానికి వెళ్లిన పోలీసుల‌కు షాక్‌

4 May, 2020 08:18 IST|Sakshi

లండన్: సెవ‌నోక్స్‌లోని ఇఘ్తామ్ ప్రాంతంలో పులి సంచ‌రిస్తోంద‌ని వార్త‌లు రావ‌డంతో పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. వెంట‌నే సాయుధ ద‌ళానికి చెందిన ప‌దిమంది పోలీసుల‌ను ఆ ప్రాంతానికి పంపించారు. తీరా ఆ ప్రాంతాన్ని గాలింపు చేప‌ట్ట‌డానికి వెళ్లిన పోలీసుల‌కు పెద్ద షాక్ త‌గిలిన‌ట్లైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఇఘ్తామ్‌  గ్రామంలో  పులి క‌నిపించిందంటూ వార్త‌లు రావ‌డంతో పోలీసులు శ‌నివారం నాడు రంగంలోకి దిగారు. ఇంత‌లో ఓ ఇంటి ముందు పులి క‌నిపించింది. ఇంకేముందీ.. వెంట‌నే దాన్ని ప‌ట్టుకునేందుకు ఆ ఇంటిపైనే హెలికాప్ట‌ర్ల‌లో చ‌క్క‌ర్లు కొట్టారు. అయితే పులిలో కాస్తైనా క‌ద‌లిక లేక‌పోవ‌డంతో ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ప‌రిశీలించిన పోలీసుల‌కు షాక్ త‌గిలిన‌ట్టైంది. (ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి..)

ఎందుకంటే అక్క‌డ‌ ఉన్న‌ది పులీ కాదు పిల్లీ కాదు.. ఉట్టి పులి బొమ్మ‌. ఇంత‌లో హెలికాప్ట‌ర్ల‌ శబ్ధంతో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జూలియ‌ట్ సింప్సన్ అనే బామ్మ పోలీసులు ఇంటిని ముట్ట‌డించడం చూసి న‌వ్వాపుకోలేక‌పోయింది. అనంత‌రం తాను త‌యారు చేసిన పులి బొమ్మ‌ను వారికి ప‌రిచ‌యం చేసింది. అది బొమ్మ‌లా లేద‌ని నిజ‌మైన పులిలా క‌నిపిస్తోంద‌ని వారు చెప్పుకొచ్చారు. దీని కోస‌మేనా ఇంత‌లా ప్ర‌య‌త్నించింది అని న‌వ్వుకుని అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ ప్ర‌దేశాన్ని పూర్తిగా గాలించిన త‌ర్వాత అక్క‌డ ఎలాంటి జంతువు లేద‌ని, ఎవరికీ ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక ఈ విష‌యాన్ని ఆ ఇంట్లోని యువ‌తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.(ఆడతోడు కోసమేనా..?)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా