యూఎస్‌లో లేడీ కారుదొంగ హల్‌చల్‌

23 Apr, 2017 13:46 IST|Sakshi
యూఎస్‌లో లేడీ కారుదొంగ హల్‌చల్‌

న్యూయార్క్‌: ఆయుధాలతో వచ్చిన ఓ మహిళ అమెరికాలో నలుగురు పిల్లలతో సహా కారెత్తుకెళ్లిపోయింది. అక్కడి పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. కారు విషయం పక్కకు పెడితే పిల్లలు పెను ప్రమాదంలో ఉన్నారని భావించిన పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్‌ అయ్యి యుద్ధప్రాతిపదికన ఆ మహిళ కోసం తీవ్రంగా గాలింపులు చేసి చివరకు అరెస్టు చేసినట్లు సమాచారం.

కొద్ది సమయంలోనే హల్‌చల్‌ చేసిన ఆ మహిళను తాము అదుపులోకి తీసుకున్నామని, పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నారని అట్లాంటా పోలీసులు తెలిపారు. నిస్సాన్‌ కారును ఆమె ఎత్తుకెళ్లిందని, ఆ సమయంలో ఆమె వద్ద ఓ తుపాకీ కూడా ఉన్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు