అవినీతిని పసిగట్టే కృత్రిమ మేధ

24 Jan, 2018 01:28 IST|Sakshi

లండన్‌: ప్రభుత్వంలో జరిగే అవినీతిని ముందుగానే అంచనా వేసే సరికొత్త కృత్రిమ మేధస్సు వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వాలడోలిడ్‌ యూనివర్సిటీకు చెందిన పరిశోధకులు దేశవ్యాప్తంగా 2000–12 మధ్య నమోదైన అవినీతి కేసుల వివరాలను పరిశోధించారు. పరిశోధన ఆధారంగా న్యూరల్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతో పనిచేసే కొత్త కంప్యూటర్‌ మోడల్‌ను రూపొందించారు.

దీని ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో, వివిధ రాష్ట్రాల్లో ఏఏ రంగాల్లో అవినీతి జరుగు తుందో ముందుగానే అంచనా వేయవచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీల జమానాల్లో అవినీతి ఎక్కువ జరుగుతోందని  తాము రూపొందించిన మోడల్‌ సైతం నిర్ధారించిందని వర్సిటీకి చెందిన ఇవాన్‌ పాస్టర్‌ తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ ట్యాక్స్, కొత్త బ్యాంక్‌ బ్రాంచీలు, కొత్త కంపెనీల ఏర్పాటు తదితర సమయాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు