ప్రపంచ అగ్రనేతగా జీ జిన్‌పింగ్

30 Jun, 2016 01:42 IST|Sakshi
ప్రపంచ అగ్రనేతగా జీ జిన్‌పింగ్

బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రపంచంలో అగ్రనేతగా అవతరించారని ఆ దేశ అధికార మీడియా పేర్కొంది. వేల కోట్ల విలువైన సిల్క్ రోడ్ ప్రాజెక్టు సహా అనేక కీలక ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారంది. ఆయన అధ్యక్షతన విదేశాలతో చైనా దౌత్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయంటూ ఒక సమగ్ర నివేదికను  విడుదల చేసింది.

సిల్క్‌రోడ్ ప్రాజెక్టు, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు, వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందాన్ని సమర్థించడం తదితరాలను ఆయన విజయాలుగా వర్ణించింది.

మరిన్ని వార్తలు