ప్లీజ్.. మాకూ ఓ బాత్రూం ఇవ్వండి!

27 Feb, 2016 12:34 IST|Sakshi
ప్లీజ్.. మాకూ ఓ బాత్రూం ఇవ్వండి!

'నేను ఓ ట్రాన్స్‌జెండర్‌ని. నాకు కొన్ని విషయాల్లో స్నేహితులు అండగా ఉన్నారు. మరికొందరు చిన్న చిన్న విషయాల్లోనూ నాకు అడ్డు తగులుతున్నారు. నాలా ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికోసం సౌత్ డకోటా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది'.. ఇవి ఓ ట్రాన్స్ జెండర్ మనోభావాలు, కష్టాలు.

అవ్వడాని అమ్మాయిగా పుట్టినా.. ఐదేళ్ల వయసులో తాను అబ్బాయి అని గుర్తించిందట థామస్ లెవిస్. గతేడాది వరకు ఏ సమస్యలు రాలేదు. తన స్నేహితులు, టీచర్ల సహకారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదట. అయితే, అప్పుడప్పుడు 'నువ్వు అబ్బాయి అని ఎలా తెలుసుకున్నావు', 'లేక నువ్వు దశలవారీగా అబ్బాయిగా మారిపోయావా' అని స్నేహితులు అడిగేవారట. నెమ్మదిగా వారు తనను అర్థం చేసుకున్నారని చెప్తున్నాడు థామస్. 18 ఏళ్ల వయసున్న థామస్ సియక్స్ ఫాల్స్ లోని లింకన్ హైస్కూల్లో చదువుతున్నాడు. గతేడాది నుంచే అతడు ట్రాన్స్‌జెండర్ అన్న విషయం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. స్కూలు, కాలేజీలలో ఇంటర్వెల్ అనగానే మిగతా విద్యార్థులు చక్కగా బయటకు పరుగెత్తుకుంటూ వెళ్తారు. కానీ, థామస్ చాలా నెర్వస్‌గా ఉంటాడు. అతడి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కారణం.. అతడు లేడీస్ టాయిలెట్స్ కు వెళ్లాళ్సి వస్తోందట.

ఆ ఇనిస్టిస్ట్యూట్ వాళ్లు థామస్‌ను జెంట్స్ బాత్రూమ్‌కు వెళ్లడానికి నిరాకరించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. త్వరలో ప్రభుత్వం ఇందుకోసం ఓ నిర్ణయం తీసుకోనుందంటూ తన వివరాల్ని వెల్లడించాడు థామస్. ప్రస్తుతం తాను ఉన్న విధానాన్ని తన తల్లి ఏ మాత్రం తప్పుబట్టలేదని, అందుకు చాలా సంతోషంగా ఉందంటున్నాడు. తనలాగే చాలా మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని, స్కూళ్లలో చదివే రోజుల్లోనే 40 శాతానికి పైగా విద్యార్థులు ఈ బాధలను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారని స్థానిక మీడియాలో ఈ వివరాలు పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు