భూమికి దగ్గరగా ఆస్టరాయిడ్‌

12 Oct, 2017 07:49 IST|Sakshi

అంటార్కిటికా దగ్గర భూమిని దాటే అవకాశం

42 వేల కిలోమీటర్ల దగ్గరగా గ్రహశకలం

ఆస్టరాయిడ్లను పరిశోధించే అవకాశం

ప్రమాదం లేదంటున్న సైంటిస్టులు

భూమికి ప్రమాదం తప్పిందా? భూమిని ఢీ కొట్టాల్సిన ఆస్టరాయిడ్.. పక్కకు తప్పుకుందా? పొరపాటున ఢీ కొడితే ఏం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులు తలెత్తేవి? ఆస్టరాయిడ్‌ భూమికి ఎంత దగ్గరగా వచ్చింది? వంటి వివరాలు తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవండి.

వాషింగ్టన్‌ : భూమికి మరో ప్రమాదం తప్పింది. అంతరిక్షంలోని ఒక చిన్న గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు వేగంగా ప్రయాణిస్తోందని గతంలో ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్ వార్నింగ్‌ నెట్‌వర్క్‌ (ఐఏడబ్ల్యూఎన్‌) ప్రకటించింది. తాజాగా ఈ గ్రహశకలం తన దిశను మార్చుకుని.. భూమికి అత్యంత సమీపంనుంచి ప్రయాణిస్తోందని ఐఏడబ్ల్యూఎన్‌ పేర్కొంది. గ్రహశకలం ప్రయాణిస్తున్న వేగాన్ని అంచనా వేస్తే గురువారం ఉదయం 11.12 నిమిషాలకు భూమిని దాటుకుని ముందు వెళుతుందని ఆ సంస్థ తెలిపింది. ఆ సమయంలో ఆస్టరాయిడ్‌..భూమికి 42 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

2012 టీసీ4గా పేర్కొనే ఈ గ్రహశకలం.. సుమారు 15 నుంచి 30 మీటర్లు వ్యాసార్థంలో ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమిని దాటే సమయంలో అంటార్కిటికాకు అత్యంత సమీపం నుంచి వెళుతుందని వారు చెబుతున్నారు. గ్రహశకలాలను అధ్యయనం చేయడానికి ఇదొక మంచి అవకాశమని.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్‌ను 2012లో హవాయిలోని పనోరమిక్‌ సర్వే టెలిస్కోప్‌ నుంచి సైంటిస్టులు కనుగొన్నారు. ఈ అస్టరాయిడ్‌పై నాసా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. విశ్వంలోని ఒక గ్రహశకలం.. గురువారం ఉదయం భూమిని దాటుకుని ముందుకు ప్రయాణిస్తుందని ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్‌ వార్నింగ్‌ నెట్‌వర్క్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు