మాలీలో నైట్‌క్లబ్‌పై దాడి

8 Mar, 2015 03:13 IST|Sakshi

బమాకో(మాలి): మాలీలో విదేశీయులు ఎక్కువగా వెళ్లే ఓ నైట్‌క్లబ్‌పై దుండగులు దాడి చేశారు. మాస్క్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఫ్రాన్స్, బెల్జియం దేశీయులిద్దరు సహా ఐదుగురు చనిపోయారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇద్దరు నిపుణులు సహా 9 మంది గాయపడ్డారు. మాలి రాజధాని బమాకోలోని ‘లా టై రెస్టారెంట్’పై శనివారం ఈ దాడి జరిగింది.  కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఓ కారులో పారిపోయారు. అక్కడి నుంచి వెళుతూ సమీపంలోనే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ కారుపైనా కాల్పులు జరపడంతో దాని డ్రైవర్ చనిపోయాడు. అలాగే ఓ ఇంటి బయట ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును, వీధిలో వెళుతున్న ఓ పౌరుడిని కూడా కాల్చి చంపారు. ఇది ఉగ్రవాద చర్యగానే ఫ్రాన్స్ భావిస్తోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు