ఆ పాములు ఎక్కడ దాక్కున్నాయో చూడండి..

18 Dec, 2019 17:09 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. మంగళవారమక్కడ సగటు ఉష్ణోగ్రత 40.9 డిగ్రీలుగా నమోదైంది. ఇది 2013లో ఏర్పడిన 40.03 డిగ్రీల రికార్డును బ్రేక్‌ చేసిందని ఆస్ట్రేలియ వాతావరణ శాఖ వెల్లడించింది. అటు ఎండ తీవ్రత సమస్యను ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలకు మరో విచిత్రకరమైన సమస్య ఎదురవుతుంది. బయటఎండ తీవ్రతను తట్టుకోలేని పాములు జనావాసాల్లోకి చొరబడి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇంట్లోకి ప్రవేశించిన పాములు మూలల్లోకి వెళ్లి తల దాచుకుంటున్నాయి. అక్కడా...ఇక్కడా అనే తేడా లేకుండా పాములు చల్లటి ప్రదేశాన్ని వెతుక్కుంటున్నాయి.

తాజాగా ఓ ఇంట్లోకి చొరబడిన పాము, ఆ తర్వాత అది మాయమవడంతో ఆందోళన చెందిన ఆ ఇంటి యజమాని... జంతు సంరక్షులకు సమాచారం ఇవ్వగా చివరికి బూట్ల మధ్యలో ఆ పాము ఉండటం గమనించారు. సంరక్షులు దానిని రక్షించి అడవుల్లోకి వదిలిపెట్టారు. మరోక సంఘటనలో వూమ్భీలోని ఓ మహిళ తన వాష్‌ రూంలో పామును గర్తించింది. మొదటి దానిని చెట్టు కొమ్మ అనుకొని ఉండగా అనంతరం అది అక్కడ లేకపోవడంతో పాము అని నిర్ధారణకు వచ్చిన ఆమె... పాము సంరక్షులకు సమాచారం ఇచ్చింది. చివరికి  వారు దానిని స్వాధీనం చేసుకున్నారు.  

కాగా ఆ పాము ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అని, ఇది ప్రపంచంలో రెండవ అత్యంత విషపూరితమైనదని వారు పేర్కొన్నారు. అలాగే మరూచైడోర్‌ ప్రాంతంలో విచిత్రంగా కారు టైరులో పామును గుర్తించారు. దీనిని రెడ్‌ బెల్లీడ్‌ బ్లాక్‌ స్నేక్‌గా గుర్తించిన సంరక్షులు పామును రక్షించి అడవిలో విడిచిపెట్టారు. ఇలాంటి ఘటనలు నిత్యం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా..వీటిలో కొన్ని అతి ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా