ఆస్ట్రేలియా వీధుల్లోకి మొసళ్లు!

5 Feb, 2019 00:46 IST|Sakshi
రోడ్డుపైకి వచ్చిన మొసలి

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలాకాయాల్సిన సైన్యం ఆస్ట్రేలియాలోని రోడ్ల మీద మొసళ్ల వేటలో పడింది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఆస్ట్రేలియాని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరద నీటితో పాటు కొట్టుకొస్తోన్న మొసళ్లు అక్కడి ప్రజలకు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఏ గుంటలో ఏనీరుందో అని కాకుండా, ఏ నీళ్లల్లో ఏ మొసలి ఉందోనని హడలిపోతున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సరిహద్దు భద్రతాదళాలైన సైనిక పటాలాలన్నీ మొసళ్లవేటలో పడ్డాయి.

గత ఎనిమిది రోజులుగా ఆస్ట్రేలియాలో కురుస్తోన్న ఈ వర్షాలు గత శతాబ్ద కాలంలో ఎరుగమని ప్రజలు విస్తుపోతున్నారు. దీనికి తోడు మొసళ్ల బీభత్సం భయభ్రాంతులకు గురిచేస్తోంది. పాఠశాలలు, విమానాశ్రయాలు మూసివేసారు. వీధుల్లోకి రావద్దన్న సైన్యం ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. ఇంకా 72 గంటల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో వీధుల్లోనుంచి మొసళ్లు ఇళ్లల్లోకి చేరితే పరిస్థితేమిటని ప్రజలు ఆందోళన  చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు