బంగారా డ్యాన్స్‌కు భారత్‌ వేదిక..!

19 Sep, 2018 16:14 IST|Sakshi

భారత్‌ వేదికగా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహంచనున్న ఆస్ట్రేలియా

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ వేదికగా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. దేశ వ్యాప్యంగా చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇరవై నగరాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్‌ హరీందర్‌ సిద్దు ఉత్సవాలకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు ఆరు నెలల పాటు జరిగే ఈ వేడుకలు ఈ నెల 23న చెన్నైలో ఆస్ట్రేలియన్ వరల్డ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.

వచ్చే ఏడాది మర్చి 30న ముగిసే ఉత్సవాలు.. సుమారు 75 రకాల ఈవెంట్స్‌తో భారతీయులను ఆకర్షించేందుకు సిద్దమవుతోంది. హరీందర్‌ సిద్దు మాట్లాడుతూ.. భారత్‌, ఆస్ట్రేలియా సంబంధాలను బలపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఉత్సవాలు సాగే ఆరు నెలల్లో తమ సంస్కృతిని భారతీయులకు చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ పెస్ట్‌లో ఆస్ట్రేలియా ఖండంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బంగారా డ్యాన్స్‌  ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. అంతే కాకుండా ప్రఖ్యాత మాస్టర్‌ షఫ్‌ గారే మెహిగాన్‌చే నోరూరుంచే ఆస్ట్రేలియన్‌ వంటకాలు, ఇంటర్నేషనల్‌ కామెడీ ఫెస్టివల్స్‌ వంటి కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా నిర్వహించనున్నార. దీనికి సంబంధించి ముగ్గురు ప్రతినిధులను సిద్దు ప్రకటించారు. గారే మెహిగాన్‌, జాన్ జుబ్రిజికి, సంగీత కళాకారుడు రాఘవ్‌ సచార్‌లు ఆస్ట్రేలియా ఫెస్ట్ అంబాసిడర్స్‌గా వ్యవహరించనున్నారు.

మరిన్ని వార్తలు