'ప్రజలారా.. ఇప్పట్లో అక్కడికి వెళ్లకండి'

31 Mar, 2016 12:55 IST|Sakshi
'ప్రజలారా.. ఇప్పట్లో అక్కడికి వెళ్లకండి'

కాన్బెర్రా: తమ దేశ పౌరులను ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పట్లో అంకారా, ఇస్తాంబుల్వంటి టర్కీ నగరాల పర్యటనకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. ప్రస్తుతం ఉగ్రవాదుల కన్ను ఆ నగరాలపై ఉన్నందున అక్కడికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ రెండు నగరాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడి 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేలా చేశారని, అందుకే తమ పౌరుల ప్రాణాలు కాపాడే దృష్ట్యా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా, మరోసారి భారీ పేలుళ్లకు పాల్పడతామని వరుస హెచ్చరికలు జారీ అవుతున్నాయని, బ్యాట్ మాన్, బింగోల్, బిట్లిస్, గాజియన్ టెప్, హక్కారీ, హాతే, మార్డిన్ వంటి ప్రాంతాలతోపాటు మరెన్నింటికో వార్నింగ్స్ ఇచ్చినందున టర్కీ నగర ప్రాంతాలకు వెళ్లొద్దని తమ ప్రజలకు హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు