తేలికైన సౌరఫలకాలు..

17 Aug, 2019 02:34 IST|Sakshi

సౌరశక్తిని విస్తృత స్థాయిలో వాడకపోయేందుకు కారణాలేంటో తెలుసా? బరువు ఎక్కువగా ఉండటం.. కావాల్సినట్లు మడతపెట్టే అవకాశం లేకపోవడం వంటివి రెండు కారణాలు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియాలోని సన్‌మ్యాన్‌ ఎనర్జీ సంస్థ వినూత్నమైన సౌర ఫలకలను అభివృద్ధి చేసింది. తేలికగా, గాజు లేకుండా తయారు చేసింది. ఫలితంగా వీటిని ఎలా అంటే అలా మడతపెట్టి వాడుకోవచ్చు. దీంతో వంపులున్న భవనాల్లోనూ ఎక్కువ సంఖ్యలో సోలార్‌ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి పెంచుకోవచ్చు. ఈ–ఆర్చ్‌ అని పిలుస్తున్న ఈ సోలార్‌ప్యానెల్‌ ఒకొక్క దాంట్లో దాదాపు వంద వరకు ఘటకాలు ఉంటాయి. రెండు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ ప్యానెల్‌ను కావాల్సిన ఆకారంలో మార్చుకునే అవకాశం ఉంది. సంప్రదాయ సోలార్‌ ప్యానెల్స్‌ ఒకొక్కటి 20 కిలోల బరువు ఉంటే ఈ ఆర్చ్‌ 2.4 కిలోలు మాత్రమే ఉంటుంది. భవనాల కిటికీలతో పాటు పైకప్పులపై కూడా ఇవి తేలిగ్గా ఇమిడిపోతాయని సన్‌మ్యాన్‌ ఎనర్జీ సీఈవో డారెన్‌మిల్లర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు