ఎట్టకేలకు ఆస్ట్రేలియా దిగొచ్చింది

30 Nov, 2015 10:46 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్కు యురేనియం సరఫరా చేయడానికి ఎట్టకేలకు అంగీకరించింది. 8 సంవత్సరాలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల ఫలితంగా ఆస్ట్రేలియా- ఇండియా అణు సహకార ఒప్పందం కుదిరింది. ఇది తక్షణమే అమలులోకి వస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియన్ కంపెనీలు భారత్తో యురేనియం వ్యాపారం నిర్వహించుకోవడానికి వీలవుతుంది. భారత్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదం చేయనుంది.

భారత్కు యురేనియం సరఫరా చేయడానికి గతంలో కూడా ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నప్పటికీ న్యూక్లియర్ అణు నిరాయుధాకరణ ఒప్పందంపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించడం, ఆస్ట్రేలియాలో ప్రభుత్వాలు మారడం లాంటి అంశాలు ఈ ఆలస్యానికి కారణమయ్యాయి. అయితే తాజాగా భారత్తో పాటు యూఏఈతో కూడా అణు సహకార ఒప్పందాలను ఆస్ట్రేలియా కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు