శవంపై హత్యాయత్నం.. ఏడేళ్ల జైలు

29 Feb, 2016 19:54 IST|Sakshi
శవంపై హత్యాయత్నం.. ఏడేళ్ల జైలు

కాన్‌బెర్రా: శవంపై  హత్యాయత్నం చేసినందుకు ఓ వ్యక్తికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన వింత కేసు.. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో నమోదైంది. డేనియల్ జేమ్స డారింగ్‌టన్ (39) అనే వ్యక్తి.. రాక్ మట్కాసీ(31) అనే వ్యక్తి శవంపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని.. ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు తేల్చింది. ప్రపంచంలోనే తొలిసారి.. శవంపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వివరాల్లోకి వెళితే.. 

రెండేళ్ల కిందట మట్కాసి, డారింగ్‌టన్ కుస్తీ పడుతుండగా ప్రమాదవశాత్తు గన్ పేలి మట్కాసి కి తగిలింది. దీంతో భయాందోళనకు గురైన డారింగ్‌టన్, మట్కాసి చనిపోలేదని భావించి అతనిపై కాల్పులు జరిపాడు. కేసు విచారించిన పరిశోధన బృందం..  డేనియన్ చనిపోయిన వ్యక్తిపై కాల్పులు జరిపాడని  అభియోగం నమోదు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయవాదుల బృందం కేసుకు సంబంధించి పలు వివరాలు సేకరించింది. మార్చి 2014లో మట్కాసి, డారింగ్‌టన్‌లు ఏదో విషయంపై వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు గన్ మిస్‌ఫైర్ కావడంతో మట్కాసి అక్కడికక్కడే.. చనిపోయాడు. ఇది తెలియని డేనియల్  చనిపోయిన వ్యక్తిపై కాల్పులు జరిపాడని తెలిపింది.

చనిపోయిన వ్యక్తి పై  హత్యాయత్నమనే కేసు ప్రపంచంలోనే మొదటిసారి జరిగిందని న్యాయవాదుల బృందం అభిప్రాయపడింది. ఇది ఒక అసాధారణ, విచిత్రమైన కేసుగా ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు 2015 డిసెంబర్‌లో పేర్కొంది.  మట్కాసి కాల్పులు జరిపే టప్పటికే.. చనిపోయాడని తేల్చిన కోర్టు, అతను చనిపోయాడని భావించి కాల్పులు జరపడాన్ని హత్యాయత్నంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

విక్టోరియా రాష్ట్ర చట్టాల ప్రకారం చనిపోయిన వ్యక్తిపై అయినా.. కాల్పులు జరపడం.. హత్యాయత్నం కిందే పరిగణిస్తారు. దీంతో జస్టిస్ కోల్ గాన్... నిందితుడు డారింగ్‌టన్ కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు  తీర్పునిచ్చారు.

 

మరిన్ని వార్తలు