సొంత వైద్యం అతన్ని కాపాడింది

8 Mar, 2018 16:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెర్త్‌ : ఎవరికైనా గుండె పోటు వస్తే ఏం చేస్తాం. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్తాం. కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తిని తీసుకెళ్లటానికి పక్కన ఎవరూ లేరు. పోనీ తెగించి ఒక్కడే వెళ్దామనుకున్న ఆస్పత్రి అంత దగ్గర్లో లేదు. అయినా సొంత వైద్యంతో తన ప్రాణాలను తానే కాపాడుకున్నాడు ఆ వ్యక్తి. 

పెర్త్‌ నగరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో 44 ఏళ్ల వ్యక్తి జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు సంకేతాలు కనిపించాయి. ఆస్పత్రి అక్కడికి 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. సహాయం అందించడానికి దగ్గర్లో ఎవరూ లేరు. అయినా ప్రాణాలపై అతను ఆశ వదలుకోలేదు. నర్సుగా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ప్రాథమిక పరీక్షలు చేసుకున్నాడు. ముందుగా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఇకెజీ) అనే పరీక్ష చేసుకున్నాడు.

ఆ ఫలితాన్ని అత్యవసర టిలిహెల్త్ ద్వారా ఓ గుండె సంబంధిత వైద్యుడికి మెయిల్‌ చేశాడు. అవతలి వైద్యుడు అతనికి గుండె పోటు వచ్చిందని నిర్ధారించాడు. దీంతో ఆ వ్యక్తి క్లాట్‌ డిసాల్వింగ్‌ అనే చికిత్స చేసుకున్నాడు. దాంతో గుండెనొప్పి తగ్గి అతను ఉపశమనం పొందాడు. ఆ మరుసటిరోజు పెర్త్‌ లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పూర్తి స్థాయిలో వైద్యం అందించుకున్నాడు. 

మరిన్ని వార్తలు