సాహసం: మెడలో పాముతో రిపోర్టింగ్‌

8 Feb, 2020 20:16 IST|Sakshi

ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఎంతో వినూత్నంగా రిపోర్టింగ్‌ చేశారు. పాముల భద్రత, విష సర్పాల నుంచి మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించాలని ఆమె భావించారు. అందుకు అనుగుణంగా ఆమె ఓ పామును మెడలో వేసుకుని రిపోర్టింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. రిపోర్టింగ్‌ చేస్తున్న సందర్భంలో పాము ఒక్కసారిగా బుసలు కొట్టింది.  పాము రిపోర్టర్‌ చేతిలోని మైక్‌ను మూడు స్తార్లు కాటు వేసింది. పాము తన కోరలతో మైక్‌ను కాటు వేస్తుంటే ఏం జరుగుతుందోనని ఆందోళన కలిగిందని రిపోర్టర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ఆ రిపోర్టర్  ఆ సమయంలో పడిన భయాన్ని తెలుపుతూ.. నేను పట్టుకున్న మైకుపై పాము కాటువేయగానే భయంతో వణికిపోయానని తెలిపారు. బుస్ బుస్ మంటూ ఆ పాము చేసిన శబ్ధానికి ఎంతో భయపడ్డానని పేర్కొన్నారు.  ఒక వేళ పాము తన చేతిపై కాటు వేస్తే ఏం జరిగేదోనని ఆందోళన చెందానని తెలిపారు. ఈ సాహసంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. భయపడుతూ మెడలో వేసుకోవడం దేనికంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే మరికొందరు ప్రజల అవగాహన కోసం సాహసం చేసిన రిపోర్టర్‌కు అభినందనలు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు