తాగుబోతు వీరంగం.. సినిమా స్టైల్లో: వైరల్‌

11 Aug, 2019 19:25 IST|Sakshi
పోలీసుల అదుపులో నికోలస్‌, గాయపడ్డ మోటార్‌ సైక్లిస్ట్‌

జకార్తా : మద్యం మత్తులో ఓ వ్యక్తి నడిరోడ్డుపై సినిమా స్టైల్లో స్టంట్లు చేశాడు. రోడ్డుపై వేగంగా వెళుతున్న వాహనాలపైకి దూకి వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన నికోలస్‌ కార్‌ అనే వ్యక్తి వెకేషన్‌ కోసం ఇండోనేషియాలోని బాలి వచ్చాడు. అక్కడి టూరిస్ట్‌ హబ్‌ అయిన కుటాలో విడిది చేశాడు. శుక్రవారం సాయంత్రం ఫుల్లుగా తాగి అక్కడి వారితో గొడవ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా సన్‌సెట్‌ రోడ్డుపైకి పరిగెత్తాడు. పిచ్చిపట్టిన వాడిలా ఎదురుగా వస్తున్న బైక్‌పైకి ఎగిరి, బైక్‌ నడుపుతున్న వ్యక్తిని కాలితో తన్నాడు.

దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి విరుచుకుపడగా బైక్‌ రోడ్డుపై కొన్ని మీటర్లు జారుకుంటూ వెళ్లిపోయింది. అనంతరం నికోలస్‌ వేగంగా వస్తున్న కారుపైకి సైతం దూకాడు. రోడ్డుపై వెళుతున్న వారిని దుర్భాషలాడుతూ అక్కడే చక్కర్లు కొట్టాడు. అతడి ఆగడాలు మితిమీరటంతో అక్కడివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో నికోలస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు