హోమో సెక్సువల్స్ కు క్షమాపణ చెప్పనున్న దేశం!

24 May, 2016 11:27 IST|Sakshi

మెల్ బోర్న్: స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించి అందుకు శిక్షగా 15 ఏళ్ల కాలాన్ని విధించినందుకు గాను.. మంగళవారం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ అధికారి డానియెల్ ఆండ్రూస్ పార్లమెంట్ లోఅధికారికంగా క్షమాపణ చెప్పనున్నారు. ఇందుకోసం గతంలో జైలు శిక్షను అనుభవించిన కొంతమంది స్వలింగసంపర్కులను పార్లమెంటులోనికి అనుమతించనున్నారు. ఇలా కొంతమంది స్వలింగసంపర్కులను పార్లమెంటులోనికి అనుమతించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వం 1981 నుంచి స్వలింగసంపర్కానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 గత ఏడాది సెప్టెంబర్ నుంచి గే, లెసిబియన్స్ లపై లింగ వివక్ష కారణంగా నమోదు చేసిన కేసులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం వివరాలను సేకరిస్తోంది. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక గ్రూప్ కు చెందిన వారికి క్షమాపణ తెలపడం ఇది మొదటిసారేం కాదు. 2008లో ఆస్ట్రేలియా అప్పటి ప్రధానమంత్రి కెవిన్ రుడ్ ఫెడరల్ గవర్నమెంట్ తరఫున ఐస్ లాండ్ లలో నివసించే ఆస్ట్రేలియన్లకు క్షమాపణ తెలిపారు.

మరిన్ని వార్తలు