ఎవరూ రాకపోతే.. డబ్బంతా ఆ పిల్లాడికే!

9 Dec, 2015 16:34 IST|Sakshi
ఎవరూ రాకపోతే.. డబ్బంతా ఆ పిల్లాడికే!
వియన్నా: ఆస్ట్రియాలోని డాన్యూబ్‌ నదిలో అకస్మాత్తుగా డబ్బుల కట్టలు తేలుతూ కనిపించాయి. అంత డబ్బు కనిపిస్తే ఎవరికైనా కళ్లు చెదురుతాయి కదా... ఒడ్డున నిలబడి చూస్తున్న పిల్లాడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ డబ్బును సొంతం చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఈత రాదు. అందుకే పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. పోలీసులు వచ్చేలోపు  ప్రాణం ఆగలేదు.. వాళ్లు వచ్చేలోపు ఎంతోకొంత దక్కించుకోవాలని ప్రయత్నించాడు. మెల్లిగా నదిలోకి వెళ్లి కొంత డబ్బు తీసుకున్నాడు. అయితే నది ఒడ్డున తచ్చాడుతున్న పిల్లాడిని చూసిన కొందరు పెద్దలు.. అతడు ఆత్మహత్య చేసుకుంటున్నాడోమేనని  కంగారుపడ్డారు. అంతా అక్కడ గుమిగూడారు. ఇంతలో పోలీసులకు రానే వచ్చి.. పెద్దఎత్తున 500, 100  యూరో కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ డబ్బుకట్టలు నదిలో ఎలా కొట్టుకొచ్చాయో అక్కడివారికి అంతుపట్టలేదు. డబ్బును చూసిన పిల్లడు మాత్రం తనకు వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడు. మరోవైపు ఇవి నకిలీ నోట్లు కావచ్చని పోలీసులు అనుమానించినా... నకిలీవి కావని తేల్చారు. ఇంత డబ్బు ఎవరు నదిలో  పడేశారు.. ఎక్కడినుంచి వచ్చిందనేది ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న సొమ్ము విలువ లక్ష యూరోలు (73 లక్షల రూపాయలు) అని అన్నారు.  
 
సాధారణంగా ఆస్ట్రియాలో ఎవరికైనా డబ్బు దొరికితే అందులో ఆ డబ్బు ఆచూకీ  చెప్పినవారికి 15 - 10 శాతాం వాటా ఇస్తారు. అంతేనా, ఆ డబ్బు అసలు  యజమాని వివరాలు ఏడాదిలోపు తెలియక పోతే...ఆ పూర్తి మొత్తాన్ని డబ్బు ఆచూకీ తెలిపిన వారికి అప్పగిస్తారట.
Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!