లండన్లోనూ తప్పని 'అసహనం' సెగ

12 Nov, 2015 17:26 IST|Sakshi

లండన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని అసహనం తాలూకు నిరసనలు వదిలేలా లేవు. దేశలో అసహనం పెరిగిపోతోందంటూ పలువురు రచయితలు, మేధావులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన మోదీకి అక్కడ కూడా ఇదే తరహా నిరసన వ్యక్తమౌతుంది. భారత్లో పెరుగుతున్న  అసహనంపై చర్యతీసుకోవాలని మోదీకి సూచించాల్సిందిగా కోరుతూ బ్రిటన్ ప్రధాని డేవిడ్  కేమరూన్కు అక్కడి రచయితలు బహిరంగ లేఖ రాశారు. దీనిలో ప్రముఖ రచయిత సల్మాన్ రష్ధీతో పాటు సుమారు రెండు వందల మంది రచయితలు సంతకం చేశారు.


నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత్లో ఛాందసవాదం, భయానకమైన పరిస్థితులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని, విమర్శకుల గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందనీ దీనిపై మోదీ వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మోదీ పర్యటన సందర్భంగా మరో వర్గం  బ్రిటన్ పార్లమెంట్ భవనంపై 'మోదీ నాట్ వెల్కమ్' అంటూ పోస్టర్ను ప్రొజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు