చైనా నోటి దురుసు.. నోబెల్‌ ఇవ్వడం తప్పట

14 Jul, 2017 16:03 IST|Sakshi
చైనా నోటి దురుసు.. నోబెల్‌ ఇవ్వడం తప్పట

బీజింగ్‌: చైనా మరోసారి తన దుష్ప్రవర్తనను బయటపెట్టుకుంది. ఏకంగా అంతర్జాతీయ సంస్థ తమ దేశ పౌరుడికి ఇచ్చిన సత్కారాన్ని తప్పుబట్టింది. ఆ వ్యక్తికి అవార్డు ఇవ్వడం అంటే దైవ దూషణ చేసినట్లేనంటూ తనకి ఇష్టం వచ్చినట్లు ప్రకటన చేసింది. చైనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం పోరాడి జైలు శిక్షకు గురైన ప్రముఖ పోరాటయోధుడు లియు జియాబో గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది.

అయితే, క్యాన్సర్‌ బారిన పడిన ఆయనకు మెరుగైన వైద్యం ఇచ్చేందుకు చైనా నిరాకరించడంతోపాటు విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు అంగీకరించలేదు. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి చైనా ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు అప్పుడప్పుడు అమెరికా, జర్మనీ నుంచి వైద్యులకు ప్రత్యేక అనుమతి ఇప్పించి వైద్యం చేయించారు. అయినప్పటికీ, ఆయన కన్నుమూశారు. దీంతో చైనా తీరు వల్లే నోబెల్‌ పురస్కార గ్రహీత కన్నుమూశాడంటూ తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన తప్పును కప్పి  ఉంచుకునేందుకు అసలు ఆయనకు నోబెల్‌ అవార్డు ఇవ్వడమంటేనే దైవ దూషణ చేసినంత పని అంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని వార్తలు