300 గ్రాముల బరువుతో పుట్టాడు!

13 Apr, 2019 10:22 IST|Sakshi

అవును నిజమే.. మూడు వందల గ్రాముల బరువుతో ఓ పిల్లాడు భూమ్మీదకు వచ్చాడు. మాములుగా ఈ బరువుతో పుట్టడం అసాధారణం. ఇలాంటివి అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొన్నారు. పుట్టినప్పుడు 11 ఔన్సుల( దాదాపుగా 300గ్రాములు) బరువుతో పుట్టాడని.. మన గుండె కంటే తక్కువ బరువు అని, సాధారణ సోడా క్యాన్‌ అంత బరువు అని వైద్యులు పేర్కొన్నారు. ఇంత తక్కువ బరువుతో పుట్టి.. బతకడమంటే మాములు విషయం కాదు. ఆ పసిబిడ్డ పుట్టినప్పుడు వాడి నాన్న అరచేతిలో సరిగ్గా సరిపోయాడని పేర్కొన్నారు.  అయితే ఆ పసికందును మళ్లీ మామూలు స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు, వైద్యులు పడ్డ కష్టం ఓసారి చూద్దాం.

న్యూయార్క్‌లో ఉంటున్న జామీ, జానీ ఫ్లోరియోలకు ఓ బిడ్డ జన్మించబోతోన్నారని ఆనందంతో ఉన్నారు. అయితే వైద్యులు పరీక్షించే సమయంలో అసలు నిజం బయటకు వచ్చింది. లోపల పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాలు అందడం లేదని సరైన ఎదుగుదల కనిపించడం లేదనే నిజం తెలిసింది. దీంతో వైద్యులు ఆపరేషన్‌ చేయాల్సిందేనని.. తమకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నం చేస్తామని చె​ప్పారు.

 

అయితే బిడ్డ పుట్టినా.. అప్పటి నుంచే అసలు పరీక్ష మొదలైందని వైద్యులు పేర్కొన్నారు. మాములుగా పుట్టాల్సిన బరువు కంటే 11రెట్లు తక్కువ బరువుతో ఉన్నాడని.. ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించాలని చెప్పారు. అయితే తల్లి మనసు బిడ్డ కోసం ఆరాటపడుతుందని తెలిసిందే కదా.. ఆసుపత్రిలో ఉన్న ప్రతిరోజు తన బిడ్డను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేది. క్రిస్‌మస్‌ రోజు, వాలెంటైన్స్‌ డేను ఇలా ప్రతీ పండుగను కొత్తగా సెలబ్రేట్‌ చేస్తూ.. అలాంటి ప్రత్యేకమైన రోజున స్పెషల్‌గా రెడీ చేసేది. మొత్తానికి తొమ్మిది నెలల వైద్యుల కష్టం, తల్లిదండ్రుల ప్రేమతో బిడ్డలో మార్పు కనిపించింది. ఇంకా తమ బిడ్డ సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు శ్రమించాల్సి ఉందని, వస్తాడనే నమ్మకం ఉందని ఫ్లోరియో తెలిపారు.

మరిన్ని వార్తలు