డైటింగ్ చేసినా బరువు పెరుగుతారు!

20 Jul, 2016 09:21 IST|Sakshi
డైటింగ్ చేసినా బరువు పెరుగుతారు!

సిడ్నీ: సాధారణంగా శరీర బరువు తగ్గడానికి డైటింగ్(తినే ఆహారాన్ని తగ్గించడం) చేస్తుంటారు. అయితే,  డైటింగ్ చేయడంలో సరైన పద్ధతులను పాటించకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. డైటింగ్ చేసేవారిలో వ్యాధి నిరోధక కణాల పనితీరు తెలుసుకునేందుకు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన పరిశోధకులు అబిగెయిల్ పొల్లాక్ పలు పరిశోధనలు నిర్వహించారు.

సరైన పద్ధతిలో డైటింగ్ చేయని వారిలో సంతృప్త కొవ్వులను శరీరం అత్యధికంగా గ్రహించుకుంటుందని ఫలితంగా శరీరం బరువు పెరుగుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. ముఖ్యంగా టి-లింఫోైసైట్లు కొవ్వులను ఎక్కువగా గ్రహించుకోవడమే దీనికి కారణం. ‘దీనికి కారణాలు తెలుసుకునేందుకు ఎలుకలపై అధ్యయనం నిర్వహించాం. దాదాపు 9 నెలలపాటు వీటికి సంతృప్త కొవ్వులను అందజేశాం. డైటింగ్ సమయాల్లో తేడా వస్తే కొవ్వు నిలిచిపోయి బరువు పెరగడం గమనించామ’ ని పొల్లాక్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు