నీది ఆకలి.. నాది బతుకు..!

14 Oct, 2017 16:47 IST|Sakshi

మొసలికి చిక్కని జింక

టాంజానియా అడవుల్లో అద్భుతం

వాషింగ్టన్‌ : బతకాలన్న కోరిక బలంగా ఉండాలేకానీ.. మృత్యు పాశం నుంచి తప్పించుకోవడం ఎంతసేపు. ఇది మనుషులకైనా జంతువులకైనా వర్తిస్తుంది. జీవించలేక.. జీవితం అంటే భయంతో జనాలు ఆత్మహత్యల వైపు నడుస్తున్నారు. అదే జంతవులు మాత్రం జీవించేందుకు ఆఖరిప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని విజయం సాధిస్తున్నాయి.

ఇక్కడ ఫొటోలో మీరు చూస్తున్నది టాంజానియాలోని మారా నది. ఈ నదిని అక్కడి ప్రభుత్వం మొసళ్ల రక్షిత ప్రదేశంగా ప్రకటించింది. చుట్టూ కీకారణ్యంలో ప్రవహించే ఈ నదిలో నీటిని తాగేందుకు పలు జంతువులు వస్తుంటాయి. సరిగ్గా ఈ సమయంలో నీటిలోని మొసళ్లు జంతువులను పట్టి ఆకలి తీర్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక మధ్యాహ్నం గడ్డి తిని దాహం తీర్చుకునేందుకు నదిలోకి దిగాయి కొన్ని జింకలు.. జీబ్రాలు.  అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక మొసలి.. పెద్దగా నోరు తెరిచి.. ఎదురుగా ఉన్న జింకను పట్టుకునేందుకు ప్రయత్నించింది.

తవరకూ నీటిలో అటూఇటూ తిరుగుతున్న జింకకు మృత్యుదేవతలా ఎదురుగా మొసలి కనిపించే సరికి పైప్రాణాలు పోయినట్టు అనిపించింది. లేని ధైర్యాన్ని,శక్తిని కూడట్టుకుని.. ఒక్కసారిగా మొసలి నోటికి అందకుండా.. అంతెత్తుకు ఎగిరింది. జింక ఎగరడం.. దూకడంతో ఏదో ప్రమాదం వచ్చిందని ఊహించిన మిగిలిన జంతువులు ఒడ్డుకు పరుగులు తీశాయి. కేవలం రెప్పపాటు కాలంలో జింక.. మొసలి దాటుకుని.. మూడుగెంతుల్లో ఒడ్డుకు చేరుకుంది.

మారియా నది ఒడ్డుకు అన్నిరకాల జంతువులు వస్తుండడంతో వాటిని ఫొటోలు తీసేందుకు ప్రముఖ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫార్‌.. వార్నెన్‌ క్రెస్‌వెల్‌ అక్కడకు వెళ్లారు. జంతువుల మధ్య పోరాటాలు.. ఇతరత్రా పరిస్థితులను ఫొటోలు తీయాలని.. ఇక్కడకు వచ్చాను.. అయితే అనుకోకుండా.. ఈ ఫొటోలు తీశాను అని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు