బ్యాడ్‌యూఎస్‌బీ.. మహా మొండి వైరస్!

4 Aug, 2014 00:40 IST|Sakshi
బ్యాడ్‌యూఎస్‌బీ.. మహా మొండి వైరస్!

హ్యాకర్లు ఇప్పటిదాకా రకరకాల కంప్యూటర్ వైరస్‌లను వ్యాప్తి చేశారు. ఐటీ నిపుణులు వాటిని తొలగించే సాఫ్ట్‌వేర్‌లనూ తయారు చేశారు. అయితే.. ఎలాంటి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లూ గుర్తించలేని, దాదాపుగా గుర్తించినా తొలగించలేని ఓ ప్రమాదకర వైరస్ ఇప్పుడు యూఎస్‌బీ డ్రైవ్‌ల ద్వారా వ్యాప్తి చెందుతోందట. ‘బ్యాడ్‌యూఎస్‌బీ’ అనే ఈ మాల్‌వేర్ ఒక్కసారి యూఎస్‌బీ డ్రైవ్‌కు ఇన్‌ఫెక్ట్ అయిందంటే చాలు..

డ్రైవ్‌ను కనెక్ట్ చేసిన ప్రతిసారీ కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి అన్ని పరికరాల్లోకీ చేరిపోతుందని, గుర్తుతెలియని ప్రోగ్రామ్‌ను వాటిలో రన్ చేసి ఆ కంప్యూటర్లను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో నియంత్రణలోకి తీసుకునేందుకు తోడ్పడుతుందని బెర్లిన్‌కు చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ ల్యాబ్స్ పరిశోధకులు చెబుతున్నా రు. కంప్యూటర్‌లోకి బ్యాడ్‌యూఎస్‌బీ మాల్‌వేర్ ప్రవేశిస్తే గనక .. ఆపరేటింగ్ సిస్టమ్‌ను రీఇన్‌స్టాల్ చేసుకోవడంతోపాటు అన్ని యూఎస్‌బీ పరికరాలనూ మార్చుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు