ప్రపంచంపై మరో హ్యాకింగ్‌ పిడుగు

25 Oct, 2017 11:28 IST|Sakshi

మాస్కో : సైబర్‌ నేరగాళ్లు ప్రపంచంపై మరోసారి మల్వేర్‌తో విరుచుపడ్డారు. ఎంత పటిష్టంగా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నా.. హ్యాకర్లు మాత్రం అంతేస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ప్రపంచాన్ని బ్యాడ్‌రాబిట్‌ మల్వేర్‌ వణికిస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌, జపాన్‌లపై బ్యాడ్‌రాబిట్‌ తీవ్రస్థాయిలో దాడి చేసింది. స్మార్ట్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సైబర్‌ నేరస్థులు.. మల్వేర్లతో హ్యాకింగ్‌ చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్నారు.

బ్యాడ్‌రాబిట్‌ ఎఫెక్ట్‌తో రష్యా, ఉక్రెయిన్‌లో విమానాలు నిలిచిపోయాయని రష్యన్‌ ఇంటర్‌ఫాక్స్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. హ్యాకర్లు.. మల్వేర్లతో ప్రపంచం మీద దాడి చేసే అవకాశముందని రెండు నెలల కిందటే అమెరికా నిఘా వర్గాలు.. ప్రకటించాయి. భారీగా ఆర్థిక వ్యవస్థలు ధ్వంసమవుతాయని.. అప్పట్లోనే అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. హ్యాకర్లు.. మౌలిక వసతుల కల్పన, రవాణా, ఇతర ఆర్థిక వ్యవస్థలపై దాడి చేస్తారని సైబర్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ రాబర్ట్‌ లిపోవస్కీ గతంలోనే పేర్కొన్నారు. బ్యాడ్‌రాబిట్‌ ర్యాన్సమ్‌వేర్‌ రకానికి చెందిన వైరస్‌. ఈ వైరస్‌ పొరపాటున కంప్యూటర్లలో ప్రవేశిస్తే.. సిస్టమ్‌ వెంటనే లాక్‌ అయిపోతుందని నిపుణులు చెబుతున్నారు. లాక్‌ ఓపెన్‌ చేసేందుకు బాధితుల నుంచి హ్యాకర్లు భారీ స్థాయిలో సొమ్మును డిమాండ్‌ చేస్తున్నారు.  

బ్యాడ్‌రాబిట్‌ లమ్వేర్‌ కారణంగా.. ఉక్రెయిన్‌లోని ఆడెస్సా ఎయిర్‌పోర్ట్‌లో విమానాలన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ప్యాసింజర్ల డేటాను అధికారులే స్వయంగా పరీక్షిస్తుండడం వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ సైబర్‌ పోలీస్‌ చీఫ్‌ మాట్లాడుతూ.. పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు