అంగారకుడికి అడ్డదారి!

29 Dec, 2014 02:35 IST|Sakshi
అంగారకుడికి అడ్డదారి!

వాషింగ్టన్: అరుణగ్రహానికి ఉపగ్రహాలను, వ్యోమగాములను తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో పంపేందుకు నాసా శాస్త్రవేత్తలు ఓ అడ్డదారిని కనుగొన్నారు. ‘బాలిస్టిక్ క్యాప్చర్’ అనే ఈ పద్ధతిలో అంగారకుడు సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలోకి ముందే వ్యోమనౌకలను పంపించి.. వాటిని మార్స్ కన్నా నెమ్మదిగా ప్రయాణించేలా చేస్తారు. దీంతో కాస్త వేగంగా వచ్చే అంగారకుడు దారిలో ఎదురయ్యే వ్యోమనౌకలను తన చుట్టూ కక్ష్యలోకి లాక్కుంటాడు. ప్రస్తుతం మార్స్‌ను చేరుకునేందుకు వ్యోమనౌకలకు 9 నెలలు పడుతోంది.

మరిన్ని వార్తలు