బాన్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి

15 Sep, 2015 02:08 IST|Sakshi
బాన్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి

బాన్: భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్(49) జర్మనీలోని బాన్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ నాయకత్వంలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ తరఫున ఆయన పోటీ చేసి, 50.06 శాతం ఓట్లతో సంపూర్ణ మెజారిటీ సాధించారు. బాన్‌కు భారత సంతతి వ్యక్తి మేయర్ కావడం ఇదే ప్రథమం.  బాన్‌లో 21 ఏళ్లుగా సాగుతున్న సోషల్ డెమోక్రటిక్ పాలనకు శ్రీధరన్ ఎన్నికతో  తెరపడింది. శ్రీధరన్ తల్లి జర్మనీ జాతీయురాలుకాగా, ఆయన తండ్రి భారత్‌నుంచి వలస వచ్చారు. అక్టోబర్ 21న మేయర్ పదవి చేపట్టనున్న  శ్రీధరన్  ప్రస్తుతం బాన్ దగ్గర్లోని కోయింగ్స్‌వింటర్ అసిస్టెంట్ మేయర్‌గా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు