ఒక్క అరటిపండు ధర రూ.87000..!

19 Apr, 2018 20:47 IST|Sakshi

నాటింగ్‌హోమ్‌ : అరటి పండు.. దాదాపు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తినదగిన అత్యంత చౌకైన ధర కలిగినది. దీనిని పేదవాడి ఆపిల్ అని కూడా అంటారు. మాములుగా అయితే ఒక్క అరటి పండు ధర నాలుగు లేదా ఐదు రూపాయలు ఉంటుంది. మహా అయితే గరిష్టంగా ఓ పది రూపాయలు ఉంటుంది. కానీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఓ మహిళ ఒక అరటిపండును ఏకంగా రూ. 87,000 పెట్టి కొన్నారు.  ఎంటీ షాకయ్యారా..?  మీలాగే ఆమె కూడా బిల్లు చూసి షాక్‌కు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే... యూకేలోని నాటింగ్‌హోమ్‌ నగరానికి చెందిన బాబీ గోర్డాన్‌ ఓ సూపర్‌ మార్కెట్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేశారు. మొత్తం బిల్లు 100 పౌండ్లు అయింది. అయితే సూపర్‌ మార్కెట్‌ వర్కర్లు పొరపాటున బిల్లును 1000 పౌండ్లుగా వేశారు. దాంట్లో ఒక్క అరటిపండుకే 930.11 పౌండ్లు( రూ. 87,000)  బిల్లు వేశారు. బిల్లు చూసి ఆశ్యర్యానికి గురైన బాబీ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అయితే బిల్లు వర్కర్ల పొరపాటు వల్ల అలా జరిగిందని, క్షమించాలని సూపర్‌ మార్కెట్‌ యజమాని బాబీని కోరారు. అలాగే తమ మార్కెట్‌లోని అరటి పండ్లు శుభ్రంగా, తాజాగా ఉంటాయి. మా అరటిపండ్లకు రూ.87,000 ధర పెట్టొచ్చని చమత్కరించారు.

>
మరిన్ని వార్తలు