ఇరాక్కు అమెరికా అదనపు బలగాలు

8 Nov, 2014 06:24 IST|Sakshi

వాషింగ్టన్: ఇరాక్కు అదనపు బలగాలను పంపేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోద ముద్ర వేశారు. 1500 మంది అమెరికా సైనిక సిబ్బంది ఇరాక్కు వెళ్లనున్నారు.

అమెరికా బలగాలు నేరుగా పోరాటంలో పాల్గొనకుండా, ఇరాక్ భద్రత సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తగిన సలహాలు ఇచ్చి సహకరించనున్నట్టు వైట్హౌస్ మీడియా కార్యదర్శి చెప్పారు. ఇరాక్ సైన్యాన్ని బలోపేతం చేయడమే తమ వ్యూహమని తెలిపారు. ఇరాక్ ప్రభుత్వం విన్నపం మేరకు ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న దాడుల్లో ఇరాక్ కల్లోలంగా మారింది.

>
మరిన్ని వార్తలు