భారత్‌ ‘భద్రత’కు మద్దతు

29 Sep, 2013 01:05 IST|Sakshi
భారత్‌ ‘భద్రత’కు మద్దతు

వాషింగ్టన్‌: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశంలో తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉద్ఘాటించారు. అంతర్జాతీయ యవనికపై ఇరుదేశాలు సహకారంతో ముందుకు సాగాలని అభిలషించారు. శుక్రవారమిక్కడ వైట్‌హౌస్‌లో ప్రధాని మన్మో„హన్‌సింగ్‌ .. ఒబామాతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టపరిచే దిశగా అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో అత్యంత కీలకమైనది పౌర అణు విద్యుత్‌పై ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం. ఐదేళ్ల కిందట భారత్‌-అమెరికా మధ్య కుదిరిన అణు ఒప్పందం ఆచరణ రూపం దాల్చేందుకు ఇది దోహదం చేయనుంది.

 

ఈ ఒప్పందంతో భారత్‌లో అణుప్లాంట్లు నెలకొల్పడానికి అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌-హిటాచీ కంపెనీలు.. ‘భారత అణు ఇంధన సంస్థ’ (ఎన్‌పీసీఐఎల్‌)తో చర్చలు మొదలుపెట్టనుంది. ఈ ఒప్పం దంలో భాగంగా అత్యాధునిక అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా భారత్‌కు అందించనుంది. ఆ పరిజ్ఞానంతో గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లో భారత ప్రభుత్వం అణుప్లాంట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అగ్రనేతల చర్చల అనంతరం వైట్‌హౌస్‌ తెలిపింది. కాగా, భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ గడ్డపై నుంచి సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై వచ్చే నెల ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో నేరుగా మాట్లాడతానని ఒబామా.. మన్మో„హన్‌కు హామీనిచ్చారు. మన్మోహన్‌కు అరుదైన గౌరవం

 

అమెరికా అధ్యక్షుడితో సమావేశ సందర్భంలో వైట్‌హౌస్‌లో మన్మో„హన్‌ సింగ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. మన్మో„హన్‌ను ఆహ్వానించడానికి ఒబామా పోర్టికో మెట్లు దిగి వచ్చారు. ఇది అత్యంత అరుదైన సంఘటన అని వైట్‌హౌస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక వేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, నాయకుడిగా మన్మో హన్‌ అంటే ఒబామా గౌరవభావంతో ఉంటారని అధికారులు గతంలోనే పేర్కొన్నారు. అంతేగాక వీరిద్దరి సమావేశం తర్వాత కూడా మన్మో„హన్‌ను ఒబామా ప్రశంసల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు