ఆర్థిక షట్‌డౌన్ పొంచి ఉంది: ఒబామా హెచ్చరిక

13 Oct, 2013 01:10 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికా బడ్జెట్ ఆమోదంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా స్తంభించిపోయే (ఎకనామిక్ షట్‌డౌన్) ప్రమాదం పొంచి ఉందని అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. దానిని తప్పించాలని, బడ్జెట్ ఆమోదానికి రిపబ్లికన్లను ఒప్పించాలని వారాంతపు సందేశంలో కాంగ్రెస్ సభ్యుల్ని  కోరారు. ఒబామాకేర్ ఆరోగ్యబిల్లుపై ఏర్పడిన సంక్షోభంతో మొదలైన ప్రభుత్వ షట్‌డౌన్ 12వ రోజుకు చేరుకుంది. రుణపరిమితి పెంపు గడువు అక్టోబర్ 17 కూడా సమీపిస్తోంది.

 

అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య సంక్షోభ నివారణపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఒబామా తన సందేశంలో పేర్కొన్నారు. మరోపక్క షట్‌డౌన్‌తో మూతపడిన జాతీయ పార్కులు, పర్యాటక స్థలాలను రాష్ట్రాల ఆర్థిక సాయంతో తాత్కాలికంగా తిరిగి తెరవనున్నారు.
 

మరిన్ని వార్తలు