ట్రంప్‌పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్‌

10 May, 2020 15:15 IST|Sakshi

న్యూయార్క్‌ :  మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి  రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్షుడు డొనా‍ల్డ్‌ ట్రంప్‌పై‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా విమర్శల దాడి మొదలుపెట్టారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని ఒబామా ఆరోపించారు. గత శుక్రవారం తన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో ఒబామా వెబ్‌ కాల్‌ ద్వారా మాట్లాడారు. ఈ వెబ్‌ కాల్‌ ఆడియో కాస్తా లీకైంది. ఈ లీకైన వెబ్‌ కాల్‌ ఆడియోలో.. మైకేల్‌ ఫ్లైన్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయవ్యవస్థను దిగజార్చిందని ఒబామా అన్నారు. ( ట్రంప్‌ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు.. ) 

నవంబర్‌ ఎన్నికలలో ట్రంప్‌పై గెలిచేందుకు తనతో కలిసి, జోయ్‌ బైడెన్‌ తరపున జరిగే ర్యాలీలో పాల్గొనాలని తన మాజీ ఉద్యోగులను ఆయన కోరారు. స్వార్థం, అనాగరికం, విభజించి పాలించటం, ఇతరులను శత్రువులుగా చూసే పద్ధతులతో పోరాడుతున్నామని, ఇవన్నీ అమెరికా పౌరుల జీవితంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే అమెరికా కరోనాను అడ్డుకునే విషయంలో విఫలమైందని అన్నారు.

>
మరిన్ని వార్తలు