ఎక్కువ కాలం బార్బర్‌ షాపుల మూత!

24 Apr, 2020 17:42 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా హేర్‌ డ్రెస్సర్స్, బ్యూటీ పార్లర్లు ఏడాది పాటు తెరచుకోకుండా మూత పడినట్లయితే హాలీవుడ్‌ చిత్రాలైన క్యాప్టెన్‌ కేవ్‌మెన్, క్యాస్ట్‌ అవేలో హీరోల్లాగా పాశ్చాత్య ప్రజలకు జుట్లు, మీసాలు, గడ్డాలు బారుగా పెరగి పోతాయి. భారత్‌లో సాధువులు, సన్యాసుల్లాగా కనిపిస్తారు. ఈ ప్రమాదం కచ్చితంగా పొంచి ఉందని లండన్‌లోని ‘గవర్నమెంట్స్‌ సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఫర్‌ ఎమర్జెన్సీస్‌ (సేజ్‌) హెచ్చరించింది.
 
కరోనా వైరస్‌ మంగళి షాపుల ద్వారా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నందున వాటిపైన నిషేధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని సేజ్‌ వెల్లడించింది. లాక్‌డౌన్‌ను హఠాత్తుగా ఒకేసారి కాకుండా ప్రాథమ్యాలను బట్టి ఒక్కొక్కటి చొప్పున క్రమంగా ఎత్తివేయాలని సూచించింది. లాక్‌డౌన్‌ ఎత్తివేతలో భాగంగా మంగళి షాపులను కూడా తెరచినట్లయితే మరోసారి కరోనా వైరస్‌ దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంగ్లండ్‌ ప్రజారోగ్య నిపుణులు, మంత్రులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం హేర్‌ డ్రెస్సర్స్‌ షాపులను మూసి ఉంచాల్సిన అవసరం వస్తే వారిని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని, షాప్‌లను తెరచినట్లయితే తమ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నేషనల్‌ హేర్‌ అండ్‌ బ్యూటీ ఫెడరేషన్‌ సీఈవో హిలరీ హాల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు