-

ఇక గుండెకు బ్యాటరీ లెస్ పేస్మేకర్

2 Nov, 2015 11:07 IST|Sakshi

వాషింగ్టన్: వైద్యరంగంలో గుండెకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పేస్మేకర్లను వాడుతున్నారు. పేస్మేకర్లు గుండెకు కావాల్సిన కదలికలను అందించడానికి ఉపయోగపడుతాయి. అయితే ఇప్పటివరకూ వాడుతున్న పేస్మేకర్లలో బ్యాటరీలను వాడుతున్నారు.  ఇక బ్యాటరీల అవసరం లేకుండా స్వతహాగా శక్తిని తయారుచేసుకునే పేస్మేకర్లు అందుబాటులోకి రానున్నయి. పీజోఎలక్ట్రిక్ సిస్టం ద్వారా గుండెకదలికల్లో జనించే శక్తినే పేస్మేకర్లు ఉపయోగించుకొని ఎలక్ట్రిక్ పవర్గా మార్చుకునే కొత్త టెక్నాలజీని అమెరికన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

ఇప్పటివరకు వాడుతున్న పేస్మేకర్లను వాటిలోని బ్యాటరీ చార్జింగ్ కోసం ఐదు నుండి పది సంవత్సరాలలో మార్చాల్సి ఉండేది. కాగా తాజా విధానంతో దీనికి పరిష్కారం లభించినట్లవుతుంనీ, తద్వారా పేస్మేకర్ల ఖర్చు తగ్గుతుందని ప్రొఫెసర్ అమిన్ కరామి తెలిపారు. పీజోఎలక్ట్రిక్ విధానం ద్వారా పేజ్మేకర్ల నిర్మాణంలో ఇంతకు ముందున్నటువంటి సంక్లిష్టతలు తొలగిపోనున్నట్లు తెలిపారు. గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధ పడుతున్న వారికోసం త్వరలోనే బ్యాటరీ లెస్ పేస్మేకర్లు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు