‘యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’

4 Nov, 2017 08:43 IST|Sakshi

సైన్యానికి దిశానిర్దేశం చేసిన జిన్‌పింగ్‌

రెండోసారి సీఎంసీ సమావేశంలో పాల్గొన్న జిన్‌పింగ్‌

సమావేశంలో పాల్గొన్న సైనికాధికారులు

యుద్ధానికి చైనా సన్నాహాలు చేస్తోందా? ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు ప్రపంచాన్ని కుదేలు చేస్తాయా? పాకిస్తాన్‌కు సహకరిస్తున్న చైనా.. ఏవరితో యుద్ధం చేయాలనుకుంటోంది? భారత్‌పై సమరానికి చైనా రెడీ అవుతోందా? అసలేం జరుగుతోంది?

బీజింగ్‌ : ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగేందుకు అవకాశం ఉంది... సైన్యం సమరాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌  ఆర్మీకి తేల్చి చెప్పారు. సెంటల్ర్‌ మిలటరీ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిన్‌పింగ్‌.. సెంట్రల్‌ మిలటరీ కమిషన్ (సీఎంసీ) సమావేశంలో సైనికాధికారులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సీఎంసీ సమావేశం జరిగినట్లుగా చైనా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలోనే జిన్‌పింగ్‌ ప్రసంగిస్తూ.. సాయుధ బలగాలు.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనాను కొత్త శకంలోకి నడిపించేందుకు కొత్తమిషన్‌ను ప్రారంభించాలని జిన్‌పింగ్‌ సైన్యానికి స్పష్టం చేశారు.

సీఎంసీ ఛైర్మన్‌ చైనా సైన్యానికి సర్వాధికారి. చైనా సైన్యం సీఎంసీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తుంది. జిన్‌పింగ్‌ రెండోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. వరుసగా రెండోసారి సీఎంసీ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. రెండు సమవేశాల్లోనూ ఆయన సమరానికి సైన్యం సిద్ధంగా ఉండాలని పేర్కొనడం విశేషం. సీఎంసీ సమావేశంలో అధ్యక్షుడు, సీఎంసీ ఛైర్మన్‌ జిన్‌పింగ్‌తో పాటు ఇతర సైనిక ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా