ఆ రాణికి చిన్ననాటి నుంచే చెట్లంటే ప్రాణం

29 Nov, 2019 15:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడంతో మొక్కలు నాటి వన సంపదను పెంచడం కోసం ఒక్కో దేశం ఒక్కోరకమైన ఉద్యమాలను చేపట్టాయి. ప్రస్తుతం భారత దేశంలో ‘గ్రీన్‌ చాలెంజ్‌’ పేరిట సెలబ్రిటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా, ఇంగ్లండ్‌లో ‘బీ ఏ ట్రీ ఏంజెల్‌’ అన్న ప్రచారంతో మొక్కలు నాటే ఉద్యమం ఉధృతంగా కొనసాగిస్తోంది. లండన్‌ నగరంలో ఈ ఉద్యమానికి ‘ది నేషనల్‌ ట్రస్ట్‌’ నాయకత్వం వహిస్తోంది. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరం చుట్టూ ఐదు భారీ వనాలు ఉన్నాయి. ఒక్కో వనంలో కోటి పాతిక లక్షల వరకు చెట్లను ఇప్పటికే పెంచారు. ఒక్కో వనం 25వే హెక్టార్ల విస్తీర్ణం ఉంటుంది. అదనంగా మరో 30 వేల హెక్టార్లలో భారీ వక్షాల సంరక్షణ బాధ్యతను ఈ ట్రస్టే చూస్తోంది.ఇప్పుడు ‘బీ ఏ ట్రీ ఏంజెల్‌’ ఉద్యమం సందర్భంగా ఈ ఐదు వనాల్లోకి పర్యాటకులను ఉచితంగా అనుమతిస్తోంది. అంటే 20 పౌండ్ల (దాదాపు 1850 రూపాయలు) చార్జీలను రద్దు చేసింది. అలాగే ఒక రోజు వేలాడే టెంటులో బస చేసే చార్జీల్లో వంద పౌండ్లను అంటే, దాదాపు ఏడు వేల రూపాయలను తగ్గించింది. అయితే ఒక షరతు వచ్చే పర్యాటకుడు తప్పనిసరిగా ఓ చెట్టును తీసుకొచ్చి ఈ వనంలో నాటాల్సి ఉంటుంది. ఇది కూడా నగర ప్రజలకు మాత్రమే పరిమితం. బ్రిటష్‌ రాణి ఎలిజబెత్‌–2 అలెగ్జాండ్ర మేరి స్ఫూర్తితోని ‘బీ ఏ ట్రీ ఏంజెల్‌’ అని పేరు పెట్టి ఉంటారు. ఆమె ఒక్క ఇంగ్లండ్‌లోనే కాకుండా కామన్‌వెల్త్‌ దేశాలతో సహా 53 దేశాల్లో ఆమె చెట్లను విరివిగా నాటడం వల్ల ఆమెను ‘ట్రీ ఏంజెల్‌’ అని పిలుస్తారు. ఎలిజబెత్‌ రాణి తన 11 ఏళ్ల ప్రాయంలో స్కాట్‌లాండ్‌లోని తన తల్లి ఇల్లైన గ్లామిస్‌ క్యాజల్‌ ఆవరణలో 1937లో మొదటిసారి  మొక్కను నాటారు. అప్పటి నుంచి ఆమె మొక్కలు నాటే ఉద్యమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు

పాక్‌కు భారత్‌ దీటైన కౌంటర్‌

ఇరాక్‌ సైన్యం కాల్పుల్లో 27 మంది మృతి

గ్రీన్‌కార్డు కోసం 2.27 లక్షల మంది భారతీయులు వెయిటింగ్‌

అమెరికాలో వీసా మోసం..

ఈనాటి ముఖ్యాంశాలు

టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది..

దలైలామాకు మాత్రమే ఆ అధికారం ఉంది

ట్రంప్‌ ఛాతి చూస్తే మూర్చపోవాల్సిందే!

గుర్రంపై క్రూరత్వం.. ట్రక్కుకు కట్టి

చైనాలో చిచ్చుపెట్టిన యువతి టిక్‌టాక్‌ వీడియో

చొక్కా లేకుండా కండలు చూపుతూ.. ట్వీట్‌!

పిలిస్తే పలకలేదన్న కోపంతో..

ఈనాటి ముఖ్యాంశాలు

బిల్‌గేట్స్‌ టిప్‌ ఫొటో ఫేక్‌

ఇంతకీ పాప్‌కార్న్‌ దొరికిందా?

వైరల్‌ : అమ్మో! పెద్ద ప్రమాదం తప్పింది

గొంతులోంచి రెండు జలగలు బయటకు తీశారు..

ఆల్బేనియాలో తీవ్ర భూకంపం

రెండు హెలికాప్టర్లు ఢీ; 13 మంది మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ మాట వినగానే గొల్లున నవ్వారు..

వైరల్ : 8 ప్యాంట్లు తొడుక్కొని.. అడ్డంగా బుక్కైంది

‘అన్ని రోడ్లు రోమ్‌’కే వెళ్లాయి!

మ్యూజియంపై దాడి : విలువైన వస్తువులు మాయం

హైదరాబాద్‌ విద్యార్థినిపై అమెరికాలో దారుణం

ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లి

హాంకాంగ్‌ ఎన్నికల్లో చైనాకు షాక్‌

ఈనాటి ముఖ్యాంశాలు

మరణం దరి చేరకుండా ఉండాలంటే.

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: అతనిలో నన్ను చూసుకుంటున్నాను!

సారీ ప్రియాంక.. ఇంత దారుణమా?

నటుడు అలీ దంపతులకు సన్మానం

సినిమా ట్రైనింగ్‌ క్లిప్స్‌ విడుదల చేసిన వర్మ

‘ఫెవిక్విక్‌’ బామ్మ కన్నుమూత

ఆస్పత్రి నుంచి కమల్‌ హాసన్‌ డిశ్చార్జ్‌