అష్రఫ్తో చర్చలు ప్రారంభించిన ప్రదాని మోదీ

25 Dec, 2015 10:44 IST|Sakshi

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. . కాబూల్ పర్యటనలో ఉన్న ఆయన అంతకు ముందు అధ్యక్ష భవనంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాగతం పలికిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఈ భేటీ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు. రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాబూల్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అయితే భద్రతా కారణాల రీత్యా మోదీ పర్యటను ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. కాబూల్‌లో రూ.710 కోట్ల వ్యయంతో భారత్‌ నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌ భవన నిర్మాణానికి 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పునాదిరాయి వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు