మేఘం ముంచుకొచ్చేస్తోంది..

4 Aug, 2014 00:30 IST|Sakshi
మేఘం ముంచుకొచ్చేస్తోంది..

మీరెప్పుడైనా ఇలాంటి సీన్‌ను చూశారా? చూడలేదు కదూ.. అందుకే ఇది ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫొటో కాంటెస్ట్-2014 విజేతగా నిలిచింది. ఇటీవల విజేతల వివరాలను ప్రకటించారు. అమెరికాలో టోర్నడోలు వచ్చినప్పుడు ఇలాంటి మేఘాలు ఏర్పడతాయి.

దీన్ని గతేడాది మే 28న అమెరికాలోని జ్యులెస్‌బర్గ్ వద్ద మార్కో కొరోసెక్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. ఈ అవార్డు కోసం మొత్తం 18 వేల ఫొటోలు ఎంట్రీలుగా రాగా.. ఈ ఫొటో అవార్డును ఎగరేసుకుపోయింది.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా