అందాల పోటీలు.. న్యాయనిర్ణేతకు దిమ్మ తిరిగే జవాబు

7 Oct, 2018 09:51 IST|Sakshi
కంటెస్టెంట్‌

కంటెస్టెంట్‌ సమాధానంతో నోరెళ్లబెట్టిన నిర్వాహకులు

మిస్‌వరల్డ్‌ బంగ్లాదేశ్‌-2018లో ఘటన

సాక్షి, న్యూఢిల్లీ : అందాల పోటీల్లో విజయం సాధించి కిరీటం సొంతం చేసుకోవాలంటే అందం ఒక్కటే సరిపోదు. తెలివి తేటలు కూడా తప్పనిసరి.  ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని అందాల పోటీల్లో ప్రశ్న జవాబుల అంకం చాలా ఆసక్తిగా ఉంటుంది. నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు చక్కని, వినూత్నమైన సమాధానాలు చెప్పి వారినే ‘క్వీన్‌’కిరీటం వరిస్తుంది.

ముంబైలో కూడా ఉంది..
మిస్‌వరల్డ్‌ బంగ్లాదేశ్‌-2018 పోటీల్లో భాగంగా నిర్వాహకులు అడిగిన ఒక సులభమైన ప్రశ్నకు ఓ కంటెస్టెంట్‌ చెప్పిన సమాధానం అక్కడున్న వారికి దిమ్మతిరిగేలా చేసింది. H2o (నీరు ఫార్ములా) అంటే ఏమిటి? అని ప్రశ్నించిన నిర్వాహకుడు.. ఆమె చెప్పిన సమాధానానికి నోరెళ్లబెట్టాడు. H2o పేరుతో ఢాకాలో రెస్టారెంట్‌ ఉంది కదా..! అని ఆమె బదులిచ్చింది. ఢాకాలోనే కాదు ముంబైలో కూడా మరో రెస్టారెంట్‌ ఉందని నిర్వాహకులు అసహనం వ్యక్తం చేశారు. ఆమె ‘సృజనాత్మకత’కు జోహార్లు అంటూ పోటీ నుంచి ఆ కంటెస్టెంట్‌ను తొలగించారు. వింత వింత పేర్లతో జనాలను ఆకర్షిస్తున్న వ్యాపారస్తుల కారణంగా ఇలాంటి సమాధానాలే వస్తాయని అక్కడున్నవారు నవ్వుకున్నారు. కాగా, మిస్‌వరల్డ్‌ బంగ్లాదేశ్‌-2018 పోటీల్లో జెనాతుల్‌ ఫిర్దౌస్‌ ఓయిషి విజేతగా నిలిచారు.
మిస్‌వరల్డ్‌ బంగ్లాదేశ్‌-2018 విజేత జెనాతుల్‌ ఫిర్దౌస్‌ ఓయిషి

మరిన్ని వార్తలు