తేనెటీగల వైద్యం ప్రాణం తీసింది..

22 Mar, 2018 20:25 IST|Sakshi

స్పెయిన్‌ : ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత‍్నమే ఆమె పాలిట శాపంగా మారింది. మృత్యువు తేనెటీగ రూపంలో కాటువేసి ప్రాణాలు తీసింది. తేనెటీగలు కుట్టించడం ద్వారా నొప్పుల నుంచి ఉపసమనం పొందడానికి చేసే’ ఎపిథెరపి’  ఆక్యుపంక్చర్‌ విధానం ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన స్పెయిన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. 

స్పెయిన్‌​కు చెందిన 55 ఏళ్ల మహిళ గత రెండేళ్లుగా కండరాళ్ల బిగుతుదనం, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ థెరపీని చేయించుకుంటోంది. అయితే కొద్ది రోజుల ముందు థెరపీలో భాగంగా తేనెటీగతో కుట్టించుకోగా స్పృహ కోల్పోయింది. యాంటీ ఎపీ వెనమ్‌ ఇచ్చినప్పటికి ప్రయోజనం లేక పోవడంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె తేనెటీగ కుట్టడం ద్వారా  వచ్చిన అలర్జీ కారణంగా కోమాలోకి వెళ్లిన్నట్లు తెలిపారు.

కొద్ది రోజుల పాటు కోమాలో ఉన్న ఆమె అనంతరం మరణించింది. వెయ్యి సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్న ఈ ప్రాచీన వైద్య విధానం ద్వారా ఇప్పటి వరకు ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి  ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారని, నైపుణ్యం లేని వారు చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలిపారు. ఆక్యుపంక్చర్‌ విధానంలో సూదుల ద్వారా లేదా తేనెటీగలు కుట్టించడం ద్వారా ఇలా రెండు రకాలుగా చేస్తారు. తేనెటీగల విధానం ద్వారా ప్రమాదం ఉన్నప్పటికీ ప్రమోజనాల దృష్ట్యా అందరూ ఈ తరహా వైద్యం చేయించుకోవటానికే మొగ్గు చూపుతుంటారు.
 

మరిన్ని వార్తలు