బీజింగ్‌లో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లం

12 Jun, 2020 17:42 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింది. ముఖ్యంగా ఆ దేశ రాజ‌ధాని బీజింగ్‌లో రెండు నెల‌లుగా ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. దీంతో బీజింగ్‌ను క‌రోనా ఫ్రీగా భావిస్తోన్న త‌రుణంలో మ‌రోసారి వైర‌స్ దాడి చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అక్క‌డ‌ గురువారం తొలి వైర‌స్ కేసు న‌మోదవ‌గా శుక్ర‌వారం మ‌రో రెండు కేసులు వెలుగు చూశాయి. శుక్ర‌వారం బీజింగ్ వైద్య అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో బీజింగ్‌లో రెండు కేసులు వెలుగు చూశాయి. (లదాఖ్‌లో చైనా దొంగ దెబ్బ)

దీంతో ఈ వారంలో కేసుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో చైనా మీట్ ఫుడ్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ సెంట‌ర్‌లో ప‌నిచేసే ఇద్ద‌రు ఉద్యోగుల‌కు క‌రోనా సోకిన‌ట్లు తేలింది. మ‌రోవైపు ఓ స్కూలు విద్యార్థి తండ్రికి పాజిటివ్ రాగా స‌ద‌రు పాఠ‌శాల‌లోని సుమారు 50 మంది విద్యార్థులు, టీచ‌ర్లను క్వారంటైన్‌కు ఆదేశించారు. అనంత‌రం పాఠ‌శాల మొత్తాన్ని శానిటైజేష‌న్ చేశారు. ఇదిలా వుండ‌గా చైనాలో కొత్త‌గా ఆరు కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. (ఈ డెలివరీ బాయ్‌ నిజంగా దేవుడు!)

మరిన్ని వార్తలు