రోబో బుద్ధాకర్షక మంత్రం!

28 Apr, 2016 20:36 IST|Sakshi

బీజింగ్: తమ మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రకటనలు, ప్రచారాలు, సాక్ష్యాలు చెప్పించడం లాంటివి చేయడం మనకు తెలిసిన పద్ధతి. అది మామూలుగా చేసేదే కదా! అందులో కొత్తే ముంది అంటున్నారు చైనాలోని బీజింగ్లో ఉన్న బుద్ధుడి ఫాలోవర్స్ ఏకంగా రోబోను తయారుచేసి ప్రజలను బుద్ధిజం వైపు ఆకర్షించే ప్రయత్నంలో పడ్డారు.

కార్టూన్ తరహాలో ఉండే ఈ రోబోకు పసుపు రంగు బట్టను, నున్నని తలతో మంత్రాలను చెప్పగలిగే విధంగా తయారు చేసేశారు. దీంతో పాటు బుద్ధిజం గురించి 20 చిన్నచిన్న ప్రశ్నలకు ఈ రోబో టకటకా సమాధానం ఇచ్చేయగలదు. బుద్ధిజాన్ని స్వీకరించిన వారు రోజూ వారీ దినచర్య ఎలా పాటించాలో కూడా ఈ రోబో నేర్పిస్తుంది.

ఓ టెక్నాలజీ కంపెనీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) నిపుణులు కలిసి చైనాకు చెందిన యూనివర్సిటీ సాయంతో సమకాలీన బుద్ధ కల్చర్ను ఈ రోబోకు ధారపోశారు. దీనిని అమలుచేసిన కొద్దిరోజులకే చైనాలో దాదాపు 3లక్షల మంది ఫాలో అవడం ప్రారంభించేశారు.

మరిన్ని వార్తలు