లాడెన్‌ హత్యా..గుడ్‌న్యూస్‌!

8 Jun, 2018 04:54 IST|Sakshi

సంతోషం వ్యక్తం చేసిన పాక్‌ అధ్యక్షుడు జర్దారీ

ఒబామా సహాయకుడు బెన్‌రోడ్స్‌

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా బలగాలు అంతమొందించాయనే వార్త వినగానే అప్పటి పాక్‌ అధ్యక్షుడు జర్దారీ సంతోషం వ్యక్తం చేశారట! అది ‘గుడ్‌ న్యూస్‌’అన్నారట! అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు సహాయకుడిగా పనిచేసిన బెన్‌ రోడ్స్‌ ఈ విషయం వెల్లడించారు. ‘ది వరల్డ్‌ యాజ్‌ ఇటీజ్‌: ఎ మెమోయిర్‌ ఆఫ్‌ ఒబామా వైట్‌ హౌస్‌’అనే తన పుస్తకంలో ఇలాంటి పలు సంచలన విషయాలు వెల్లడించారు.

అబోతాబాద్‌లో రహస్య జీవితం గడుపుతున్న లాడెన్‌ స్థావరంపై 2011 మే 2వ తేదీ రాత్రి అమెరికా ప్రత్యేక బలగాలు దాడిచేసి, హతమార్చాయి. ఈ విషయా న్ని వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్వయంగా జర్దారీకి ఫోన్‌ చేసి చెప్పారు. అది వినగానే ‘పర్యవసానాలు ఎలా ఉన్నా, ఇది చాలా మంచి వార్త. ఇప్పటికే చాలా ఆలస్యమయింది.

మీకు, అమెరికా ప్రజలకు దేవుడు తోడుగా ఉంటాడు’అని జర్దారీ అన్నట్లు రోడ్స్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ సార్వభౌమత్వానికి భంగం కలిగేలా అమెరికా వ్యవహరించటంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ జర్దారీ ఆందోళన చెందలేదని రోడ్స్‌ తెలిపారు. జర్దారీకి తెలిపిన తర్వాతే ఒబామా లాడెన్‌ పతనాన్ని అమెరికా ప్రజలకు వెల్లడించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు